swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 5:06 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

అల్లుడు పై మామ హత్య ప్రయత్నం కేసు నమోదు

బంగారుపాళ్యం.స్వర్ణసాగరం. జనవరి 12

బంగారుపాలెం మండల పరిధిలోని మహాసముద్రం గ్రామంలో అల్లుడు పై మామ కత్తితో దాడి కేసు నమోదు బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉంది బంగారుపాలెం దళిత వాడికి చెందిన మురగయ్య కుమారుడు నరేష్ తనకు కూతురినిచ్చిన మామ అర్జునయ్యకు ఒక లక్ష యాభై వేల రూపాయలు అప్పు తీసివ్వగా ఎన్ని రోజులైనా డబ్బులు అల్లుడు నరేష్ కు ఇవ్వకపోవడంతో ఆదివారం రాత్రి నరేష్ తనకు పిల్లనిచ్చిన మామ అర్జునయ్య ఉన్న మహాసముద్రం గ్రామానికి  పోయి తను డబ్బులు ఇవ్వమని అడగగా కోపం వచ్చి నరేష్ పై కత్తితో దాడి చేసి చంపాలని చూసాడని నరేష్ పిర్యాదు మేరకు అర్జునయ పై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసినట్లు బంగారుపాలెం సిఐ తెలిపారు