కోట స్వర్ణసాగరం జనవరి 26
కోట మండలం కొత్తపాళెం గ్రామలోని
పిఎసిఎస్ లో చైర్ పర్సన్ ఉచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రవీంద్రనాధ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేశారు.అనంతరం అందరికి స్వీట్లు పంచి పెట్టి రైతులకు,ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపద్యంలో పుచ్చూరు రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా ఎరువులు సమృద్ధిగా అందుతున్నాయని ఆ ప్రాంత రైతులు ఆయనకు శాలువాలతో సత్కరించి సన్మానించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు పిఎసిఎస్ లో చైర్ పర్సన్ వుచురు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం దేశ ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు,బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తించి,దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించబడిన రాజ్యాంగం మన దేశానికి మార్గదర్శకం అని మనకు సమాన హక్కులను స్వేచ్ఛను ప్రసాదించిందని ఎందరో స్వాతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలను పోరాటాలను స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి,కట్టా శంకర్ రెడ్డి శానంపూడి గోపాల్ రెడ్డి, పెనుబోలు శ్యాం ప్రసాద్ రెడ్డి కందల రాధాకృష్ణారెడ్డి,వ్యవసాయ సంఘం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.