కోట స్వర్ణసాగరం జనవరి 15
కోట మండలం శ్యామసుందరపురం కాలనీకి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి చాలాకాలంగా షాదీ మంజిల్ కళ్యాణ మండపంలో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వెంకటయ్య కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలిసి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో గురువారం కోటలో టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ మాణికల పవన్ కుమార్ చేతుల మీదుగా బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా మాణికుల పవన్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు లాగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పనిచేస్తున్నారని,సునీల్ కుమార్ నాయకత్వంలో గూడూరు నియోజకవర్గ పరిధిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు.అనారోగ్య బాధితుడు వెంకటయ్య ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి కోట టిడిపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంషుద్దీన్,తెలుగుదేశం పార్టీ నాయకులు నౌషాద్,నాయాబ్,తల్లం శ్రీనివాసులు,ముసునూరు మునిరాజ,నందా మోహన్, తదితరులు పాల్గొన్నారు.