కోట స్వర్ణసాగరం జనవరి 29
నెల్లూరు జిల్లా,కోట మండలం,చిట్టేడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి విజయభాస్కర్, సునందమ్మ దంపదల కుమారుడు ముత్యాలపాటి చైతన్య బుధవారం ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్:-2 పరీక్ష ఫలితాలల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(సాధారణ పరిపాలన శాఖ)పోస్టుకు ఎంపియ్యారు.ప్రస్తుతానికి అతను చిట్టమూరు మండలం,పెళ్లకూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.దీనితో అతనితల్లిదండ్రులు,బంధుమిత్రులు,తోటి ఉద్యోగస్తులు శుభాకాంక్షలు తెలిపారు.