కోట స్వర్ణసాగరం జనవరి 22
కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని దీని కారణంగా దోమలు ఎక్కువగా కుట్టడం వల్ల విషజ్వరాలు,చర్మ వ్యాధులు వంటి సమస్యలతో సతమతం అవుతున్నామని కాలనీ ప్రజలు వాపోతున్నారు.గడిచిన వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురిసి పేరుకుపోయిన చెత్త చెదారం వలన దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందాయని, పంచాయతీ అధికారులకు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా దోమల మందు పిచికారి చేద్దామనే ఉద్దేశమే లేదని,డ్రైనేజీ కాలువలు బండల కింద నెలలు తరబడి పేరుకుపోయిన చెడ్డ చెదారంతో డ్రైనేజీ కాలవలలో నుంచి మురికి నీరు రోడ్లపై ప్రవహించి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందన్నారు.పంచాయతీ అధికారులు పూర్తిగా శానిటేషన్ పనులను మానేశారని,కేవలం నాయకులు,ఎమ్మెల్యేలు వచ్చే సమయంలో మాత్రమే బ్లీచింగ్ పిచికారి చేయడం మంచి పద్ధతి కాదని,పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి బ్లీచింగ్,దోమల మందులు వంటివి పిచికారి చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కాలనీవాసులు వాపోతున్నారు.