swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 3:35 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్

స్వర్ణసాగరం డోర్నకల్ 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్, అన్నారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోనీ అజరయ్య ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు, ప్రజా పాలన అభివృద్ధి లక్ష్యంగా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని 15 వార్డులకు ఒక్కొక్క వార్డుకు కోటి రూపాయల చొప్పున సిసి రోడ్లు సైడు డ్రైనేజ్ 10 కోట్ల తో బీటీ రోడ్లను నిర్వహిస్తున్న  పనులను పరిశీలించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలు  నెరవేరుస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ 10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎకరానికి 12 వేల రైతు భరోసా రైతు బీమా 24 గంటల ఉచిత విద్యుత్ మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి ఇందిరమ్మ మహిళ క్యాంటీన్లు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని గత సర్పంచ్ ఎన్నికలలో ఆదరించారని, వచ్చే మున్సిపాలిటీ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో ప్రతి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నరు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని రామచంద్రు నాయక్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు సుమేరు జైన్, నాయకులు తాళ్లూరి గంగాధర్, మాద శ్రీనివాస్ వాంకుడోత్ వీరన్న, కేశబోయిన కోటిలింగం, హరి కృష్ణ, ఖాదర్ బాబా,రెడ్డబోయిన శంకర్, మామిడి నాగరాజు, సౌడం మహేష్,ఏపూరి రమణ, ఎడమ కంటి రవి, ప్రవీణ్ బాబు,ఫరిద్, పవన్, సత్యనారాయణ,మున్నా, సర్పంచులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.