కోట స్వర్ణసాగరం జనవరి 17
కోటలోని ప్రగతి కాలేజ్ రోడ్డు నందుగల కాంబ్లేస్ వెల్ నెస్ సెంటర్ నందు కోట మండల ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్, బీసీఎన్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ దాసి రాజేష్ జన్మదిన వేడుకలు కోట జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యుల నడుమ దాసి రాజేష్ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు అందించారు.పలువురు జర్నలిస్టులు దాసి రాజేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా కోట మండల జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు దాసి రాజేష్ మాట్లాడుతూ తనపై అభిమానంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తోటి జర్నలిస్ట్ మిత్రులకు,అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో కోట మండల ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సాక్షి విలేఖరి మధు,పురిణి సుబ్రహ్మణ్యం,కోడూరు రాము, మట్టిగుంట సురేంద్ర బాబు,కిషోర్, కట్టా జనార్ధన్,అరుణ్ కాంబ్లె,పాకం చెన్నకేశవులు,మణి, తదితరులు పాల్గొన్నారు.