swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 3:14 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

కోట పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం పండగ వేల ఇబ్బందులలో గిరిజనులు

కోట స్వర్ణసాగరం జనవరి 14

కోట పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం పట్ల కోట ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు.సమస్యల పరిష్కారానికి మక్కువ చూపని పంచాయతీ అధికారుల పనితీరుపై కోట ప్రజలు మండిపడుతున్నారు.గత నాలుగు ఐదు రోజుల నుండి కోట మండలం నార్త్ గిరిజన కాలనీలో అంగన్వాడి కేంద్రం వద్ద పంచాయితీ త్రాగునీటి పైపులైను లీకేజీ కారణంగా  రోడ్డు,అంగన్వాడి కేంద్ర ప్రాంగణం మొత్తం బురదమయంగా మారి అంగన్వాడి చిన్నారులు,కాలనీ వృద్ధులు ఆ బురద నీటిలో నడవలేక నరకయాతన అనుభవిస్తున్నారు.  ఈ సమస్యపై ఓ దినపత్రికలో మంగళవారం ప్రచురించిన పంచాయతీ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరించడంపై ప్రజలు పండుగ వేళ బురదలో నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.