కోడి పందెం స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి,

తంగేళ్లపాలెంలో నిర్వాహకుల అరెస్ట్, స్వర్ణసాగరం – తొట్టంబేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలంలో అనధికారికంగా నిర్వహిస్తున్న కోడి పందెం స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపాలెం ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే నమ్మకమైన సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ దాడుల్లో కోడి పందెం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు కోళ్లు, రూ.1,500 నగదు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి తొట్టంబేడు మరియు బుచ్చినాయుడు...