కోట స్వర్ణసాగరం జనవరి 19
మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున కోట శ్యామసుందరపురంలో మృతి చెందిన గండికోట కస్తూరయ్య కుటుంబానికి 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ అథ్యక్షుడు మద్దాలి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి తన అథ్యక్షతన కోట గ్రామానికి చెందిన 20 మంది సభ్యులుగా మద్దాలి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతానికి కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అథ్యక్షుడు మద్దాలి సర్వోత్తమరెడ్డి తో పాటు,ప్రతినిధులు తీగల సురేష్ బాబు,తూపిలి రాధాక్రిష్ణారెడ్డి, బండారు క్రిష్ణయ్య,మర్రి అనీల్,ఉంటా నీలిమ,నందం మోహన్,ముసునూరు వంశీ,తిరుపతి సుహాసిని,పంట్రంగం వసంత్ తదితరులు పాల్గొన్నారు.