swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 6:19 am Digital Edition : RAMESH THOTTAMBEDU

గాలి బ్రదర్స్‌కు ఘన సన్మానం,కొణతనేరి తెలుగు యువత ఘన అభినందనలు,

స్వర్ణసాగరం- తొట్టంబేడు,

శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం దిగువ కొణతనేరి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, తొట్టంబేడు మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడులకు కొణతనేరి తెలుగు యువత ఘన సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా దుశ్యాలువాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేసి తమ గౌరవాభిమానాలను వ్యక్తం చేశారు.
గ్రామ రాజకీయాల్లో కొణతనేరి నుంచి ఎంపీపీగా కోవి పోలమ్మ, జడ్పిటిసిగా గాలి అనసూయమ్మ, వైస్ ఎంపీపీగా గాలి మురళి నాయుడులను ఎంపిక చేసి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసినందుకు గాలి బ్రదర్స్ సేవలను యువత కొనియాడింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతగుంట గురవయ్య నాయుడుల ఆధ్వర్యంలో విజయవంతంగా అమలయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పెయ్యిలు కస్తూరయ్య, సండ్ర కార్తీక్ చౌదరి, దుగ్గులూరు భాను ప్రకాష్, గోరంట్ల ధనలక్ష్మి, వల్లూరు హరిబాబు, వినయ్, నారమల్లి మణి తదితరులు పాల్గొన్నారు.