గ్రామీణ శివాలయాల సంరక్షణకు దేవస్థానం చొరవ చూపాలి,

శిథిల ఆలయాలను దత్తత తీసుకుని పునరుద్ధరించాలి,– కలవగుంట భరత్ రెడ్డి, స్వర్ణ సాగరం--- తొట్టంబేడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన శివాలయాల రక్షణ మనందరి బాధ్యత అని ప్రముఖ సంఘ సేవకులు కలవగుంట భరత్ రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలను శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం దత్తత తీసుకుని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు పగడాల మురళి, కొప్పర్ల నాగరాజు, విజయలక్ష్మిలను వేర్వేరుగా కలిసి...