swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 3:07 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ పై పోలీసుల అవగాహణ

రేణిగుంట స్వర్ణ సాగరం జనవరి 12

రేణిగుంట పట్టణంలో టాక్సీ డ్రైవర్లకు అర్బన్ పోలీసులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకి ముఖద్వారంగా ప్రసిద్ధి చెందిన రేణిగుంట పట్టణంలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ప్రాంతాలు భక్తులతో నిత్యం రద్దీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, నివారించుటకు రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు, రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  జయచంద్ర ఆదేశాల మేరకు  రేణిగుంట పట్టణంలోని ఆటో స్టాండ్, టాక్సీ స్టాండ్ డ్రైవర్లను రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ధర్మారెడ్డి కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ధర్మారెడ్డి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా సూచించారు. ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, ఆటోలు మరియు టాక్సీలు వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే నిలపాలని, రోడ్డుపై అడ్డంగా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యం మరియు పట్టణంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా డ్రైవర్లందరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.