తరతరాలకు స్ఫూర్తినిచ్చే చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్–టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్
కోట స్వర్ణసాగరం జనవరి 18 తరతరాలకు స్ఫూర్తినిచ్చే చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని తిరుపతి జిల్లా పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు.ఆదివారం కోట మండలం కోటలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ అధ్యక్షతన స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ నేపథ్యంలో కోటమ్మ గుడి గిరిజన కాలనీలో పేదలకు...