swarnasagaram.com
Date of Publish : 08 January 2026, 1:47 pm Posted by : Pakam chennakesavulu Kota Mandal

*తిరుపతి,చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల మీడియా జోనల్ కో – ఆర్డినేటర్ గా కట్టా జనార్ధన్ నియామకం*

*కోట స్వర్ణసాగరం జనవరి 8*

తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల మీడియా మీడియా కో – ఆర్డినేటర్ గా కట్టా.జనార్ధన్, కోటకు చెందిన జర్నలిస్ట్ కట్టా.జనార్ధన్ నియామకం. తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల మీడియా కో – ఆర్డినేటర్ గా కట్టా.జనార్ధన్, నియమించినట్లు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్.జిలానీ భాషా తెలిపారు. నేషనల్ ఆర్.టి.ఐ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో నాలుగు జిల్లాల మీడియా కో – ఆర్డినేటర్ నియామకం పట్ల పలువురు మిత్రులు శ్రేయోభిలాషులు అభినందించి హర్ష వ్యక్తం చేశారు. సహచర పాత్రికేయ మిత్రులు ఈ సందర్భంగా..అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కట్టా.జనార్దన్ మాట్లాడుతూ..మానవ హక్కుల పై బాధ్యతాయుతమైన స్థానంలో నిలిపినందుకు చైర్మన్ జిలాని భాషకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో పారదర్శకంగా సమాజం కోసం సంస్థ కోసం పని చేస్తానని తెలిపారు…