swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 7:56 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

దారా సుబ్బయ్య కుటుంబానికి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున కోట దళితవాడలో మృతి చెందిన దార సుబ్బయ్య  కుమారుడు దారా ప్రశాంత్ కి 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి మద్దాలి సర్వోత్తమరెడ్డి ద్వారా తామంతా సభ్యులుగా ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతానికి కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తీగల సురేష్ బాబు తూపిలి రాథాక్రిష్ణారెడ్డి, పాలెపు సుధీర్ కుమార్ రెడ్డి,మర్రి పోలయ్య, బండారు క్రిష్ణయ్య,మర్రి అనీల్,తిరువీధుల నాగార్జున,ఉంటా నీలిమ,ఎంబేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.