కోట స్వర్ణసాగరం జనవరి 23
కోట మండలం కోటలోని బాలసదనం వసతి గృహమునందు టిడిపి నేత నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఐటీ,మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.బాలసదనం వసతిగృహంలో ఉన్న విద్యార్థినిల నడుమ భారీ కేకును కట్ చేసి విద్యార్థినులకు పంచిపెట్టారు.అనంతరం విద్యార్థినిలకు 40 మందికి దుప్పట్లు,పుస్తకాలు అందించారు.ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువ కెరటం నారా లోకేష్ బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని,యువగళం పాదయాత్రతో టిడిపి ను అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించారన్నారు.కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు.యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని చురగొంటున్న యువ నాయకుడు మరిన్ని పదవులు చేపట్టి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీస్సులు అందించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు నాయకులు వినోద్ కుమార్ రెడ్డి అనుచరులు భారీగా పాల్గొన్నారు.