swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 11:15 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కోటలో దోమలు నివారణ చర్యలు

కోట స్వర్ణసాగరం జనవరి 23

కోట మండలం కోట పంచాయతి పరిధిలో దోమలు బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని దోమలు నివారణ చర్యలు చేపట్టాలని గురువారం స్వర్ణసాగరం దినపత్రిక పత్రికలో ప్రచురితం అయిన వార్తకు టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి స్పందించారు.వినోద్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పంచాయతి సెక్రటరీ రాజశేఖర్ పంచాయతి కార్మికులచే  పంచాయతీ పరిధిలో గురువారం దోమల మందులు స్ప్రే చేయించారు.ఈ సందర్భంగా కోట పంచాయతీ ప్రజల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి స్పందించిన పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ కి కోట ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజా సమస్యలపై పోరాడుతానని గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొని వస్తే అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్, వార్డు మెంబర్లు కిరణ్ కుమార్,విజయమ్మ, సుహాసిని పంచాయతీ సిబ్బంది ఉన్నారు.