swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 6:22 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నార్త్ గిరిజన కాలనీలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు కూరగాయల పంపిణీ

కోట స్వర్ణసాగరం జనవరి 13

కోట మండలం నార్త్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద గిరిజన కుటుంబాలకు ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యం చైర్మన్ ఎంబేటి వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ కటారి జయ జయ రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆర్.వి ఫౌండేషన్ ప్రతినిధులు తహసిల్దార్ కటారి జయ జయ రావు కి పూలమాలలు శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం తహసిల్దార్ జయ జయ రావు చేతులమీదుగా   120 కుటుంబాల వారికి కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జయ జయ రావు మాట్లాడుతూ ఆర్.వి. రమణయ్య పేదల కోసం అహర్నిశలు కృషి చేసేవారన్నారు.ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం మంచిదన్నారు.అనంతరం ఆర్.వి.ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని భావించి గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.నార్త్ గిరిజన కాలనీలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహిస్తామని ఆయన తెలిపారు.మీకు ఏ సమస్య వచ్చినా ఆర్.వి.ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు.కార్యక్రమంలో తహసిల్దార్ జయ జయ రావు,నార్త్ గిరిజన కాలనీ వాసులు,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.