నిరుపేదలకు అండగా గ్రీన్ ఫౌండేషన్ సేవలు అమోఘం.. కోట ఎస్సై పవన్ కుమార్
*కోట స్వర్ణసాగరం జనవరి 14* నిరుపేదలకు అండగా నిలుస్తున్న గ్రీన్ ఫౌండేషన్ సేవలు అమోఘమని కోట ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు.కోట మండలం కోటలోని నార్త్ గిరిజన కాలనీలో సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకొని బుధవారం గ్రీన్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కోట ఎస్సై పవన్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా నిరుపేద గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కోట ఎస్సై పవన్...