కోట స్వర్ణసాగరం జనవరి 25
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని కోట మండలం తహసీల్దార్ జయ జయ రావు పేర్కొన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కోట తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జయ జయ రావు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని కుల మత వర్గ భాష ప్రభావితం కాకుండా ఎన్నికలలో నిర్ణయంగా ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం సీనియర్ సిటిజనులను శాలువాలు,పూలమాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం మహిళా సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ జయ జయ రావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించు కోవాలని సూచించారు.18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు విలువను తెలుసుకోవాలని,ఓటు యొక్క ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు,సిబ్బంది ఉన్నారు.