ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి అవసరం,– పి. సురేంద్రనాథ్, ఎం.పీ.డీ.వో,
స్వర్ణ సాగరం ---తొట్టంబేడు, శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి అవసరమని తొట్టంబేడు మండల ఎం.పీ.డీ.వో పి. సురేంద్రనాథ్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ స్టేడియంలో గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తుంటారని, అలాంటి వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే సమయం దొరికిన ప్పుడల్లా క్రికెట్ వంటి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు....