swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 8:41 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

భారత రాజ్యాంగం దేశ ప్రజలకు వరం..కోట ఎస్సై పవన్ కుమార్

కోట స్వర్ణసాగరం జనవరి 26

భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక వరమని కోట ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం కోట పోలీస్ స్టేషన్లో ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు.అనంతరం వివిధ దేశనాయకుల విషాదరణలో వచ్చిన అంగన్వాడి చిన్నారులకు స్వీట్లు చాక్లెట్లు పంచి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కోట ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయిందని గుర్తు చేశారు.దేశ స్వాతంత్రం కోసం గాంధీజీ,భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది త్యాగమూర్తులు పోరాడారని కొనియాడారు.దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంతో పాటు యావత్ ప్రపంచం గర్వించే విధంగా  1950 జనవరి 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు.భారత రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రస్తుతం చట్టాలు నడుస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కోట పోలీస్ స్టేషన్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది,చిన్నారులు పాల్గొన్నారు.