swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 10:13 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ దాసి రాజేష్ జన్మదిన వేడుకలు 

కోట స్వర్ణసాగరం జనవరి 17

కోట మండలం కోటలో యువ నాయకుడు మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో అభ్యుదయ భావాలతో జర్నలిస్ట్ రంగంలో అడుగుపెట్టి ఆంధ్రజ్యోతి,సాక్షి పత్రికల్లో సంచలనాలు సృష్టించి తనకంటూ ఒక్క ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్ట్,ప్రస్తుత బీసీఎన్ న్యూస్ స్టాప్ రిపోర్టర్,కోట మండలం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు దాసి రాజేష్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో చంద్రప్రకాష్,కోట పట్టణ యువత అందరూ కలిసి దాసి రాజేష్ కు చాక్లెట్ మాల శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కోట పట్టణ యువత ఏర్పాటు చేసిన భారీ కేక్ ను రాజేష్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు.ఈ సందర్భంగా మీజూరు చంద్రప్రకాష్ మాట్లాడుతూ జర్నలిజంలో మంచి మానవతా విలువలు కలిగిన వ్యక్తి,సేవా గుణం, నిజాన్ని నిర్భయంగా రాయగల సత్తాగలిగిన వ్యక్తి దాసి రాజేష్ జన్మదిన వేడుకలు తమ ఆధ్వర్యంలో జరపడం సంతోషంగా ఉందన్నారు.అనంతరం జర్నలిస్ట్ దాసి రాజేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ యువత షేక్ మొయిన్ బాషా,నీలి గోపి,మునిరాజా,విష్ణు,నవీన్,ప్రకాష్, బషీర్,సంధాని,సాయి,దయాకర్,మధు బాబు,మౌనేష్,ఉదయ్,సమర్పన్ తదితరులు పాల్గొన్నారు.