swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 2:11 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

యువత క్రీడా స్ఫూర్తితో మెలగాలి..టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి

కోట స్వర్ణసాగరం జనవరి 29

యువత క్రీడా స్పూర్తితో మెలగాలని విద్యతోపాటు క్రీడారంగంలో కూడా ముందుండాలని టిడిపి నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.కోట మండలం కోటలోని అల్లారెడ్డి శ్యామసుందరపురం కాలనీకి చెందిన యువత గురువారం పొద్దున్నే నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని కలిసి తమకు క్రికెట్ కిట్టు ను అందించాలని కోరారు.వెంటనే స్పందించిన వినోద్ కుమార్ రెడ్డి యువత ఎదుగుదలకు మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడే క్రీడారంగం ను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరు బాధ్యత అని,శ్యామసుందరపురం కాలనీ యువత కోరినట్లుగా వారికి క్రికెట్ కిట్టు ను అందిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా కాలనీ యువత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.