కోట స్వర్ణసాగరం జనవరి 19
యువత ప్రజలు సమాజం పట్ల గౌరవప్రదంగా బాధ్యత కలిగి వ్యవహరించాలని లేనియెడల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు హెచ్చరించారు. సోమవారం నాడు కోట పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో సి.ఐ.కిషోర్ బాబు మాట్లాడుతూ 17వ తేదీ రాత్రి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు వచ్చి ఆసుపత్రి సిబ్బంది మీద అనుచితంగా వ్యవహరించి సిబ్బందిపై దాడి చేసిన ఏడుగురిని గుర్తించి అందులో 5మందిని అరెస్టు చేశామని తెలిపారు.వారిపై కేసులు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుర్తించిన ఏడు మందిలో ఇద్దరి మీద ఇదివరకే రౌడీషీట్లు ఉన్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఈ ఐదు మంది నిందితుల మీద కూడా రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు.నిందితులను బజారులో నడిపించారు. ఈ సందర్భంగా ప్రజలకు యువకులకు ముఖ్య హెచ్చరిక చేశారు.ప్రజలు యువకులు సమాజం పట్ల బాధ్యత కలిగి చట్టాలను గౌరవిస్తూ అవసరమైన చోట పోలీసు వారి సహాయం కోరవచ్చునని అంతే గాని సొంత నిర్ణయాలతో కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన సూచించారు. నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.కోట ఆసుపత్రిలో జరిగిన సంఘటన విషయంలో వాచ్మెన్ వ్యవహరించిన తీరు కూడా సరైన కాదని ఆవిషయంలో కూడా పూర్తి విచారణ జరిపి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సిఐ కిషోర్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోట ఎస్సై పవన్ కుమార్ సిబ్బంది ఉన్నారు.