రెడ్డిగుంట చెరువు ఆక్రమణకు పాల్పడిన రియల్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్

వరదయ్య పాలెం స్వర్ణ సాగరం జనవరి 18 వరదయ్యపాళెం మండలంలోని కంచరపాళెం పంచాయతీ పరిధిలోని రెడ్డిగుంట చెరువును రియల్టర్లు అక్రమంగా ఆక్రమించడం దుర్మార్గం. చెన్నమ్కి చెందిన ఓ రియల్టర్ వ్యాపారి ఇందుకు బరితెగించిన తీరు చూస్తే అధికారుల తీరుపై కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. చెరువుతో పాటుగా చెరువులోని మట్టిని సైతం దర్జాగా తమ భూమిలో చదునుకు వేసుకోవడం, చెరువుకు రెండువైపులా ఉన్న కాలువలను సైతం పూడ్చివేయడం జరిగింది. ఇది చాలదన్నట్లుగా చెరువు కట్టకు ఆనుకుని ప్రహరీగోడ నిర్మించడం జరిగింది. ఇందుకోసం చెరువు కట్టను...