swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 8:51 am Digital Edition : DAMA VIJAYAKUMAR

సంక్రాంతి పండుగ సందర్భంగా  జాగ్రత్తలు పాటించాలి

స్వర్ణసాగరం బుచ్చినాయుడు కండ్రిగ.

సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడంలో వినియోగదారుల భద్రత అత్యంత ముఖ్యం. ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటూనే, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా వినియోగదారు లందరూ కింది సూచనలను తప్పనిసరిగా పాటించాలని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. అని మండల విద్యుత్ శాఖ అధికారి చలపతి ఒక ప్రకటనలో తెలియజేశారు.

భద్రతకు సంబంధించినపాటించవలసిన ముఖ్యమైన భద్రతా సూచనలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి:

గాలిపటాలను ఎప్పుడూ విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు సబ్‌స్టేషన్లకు దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఎగురవేయాలి. గాలిపటాల దారాలు విద్యుత్ తీగలకు తగిలితే ప్రాణాపాయమైన విద్యుదాఘాతం విద్యుత్ షాక్ సంభవించే ప్రమాదం ఉంది.

లోహ పూత (చైనీస్) దారాలు వాడకండి:

ప్లాస్టిక్, నైలాన్ లేదా లోహపు పూతఉన్న మంజా లేదా ‘చైనీస్ దారాలు’ విద్యుత్‌ను అత్యంత సులభంగా ప్రసరింప జేస్తాయి. ఇలాంటి దారాలు పొరపాటున విద్యుత్ లైన్లను తాకినప్పుడు, గాలిపటం ఎగురవేస్తున్న వారికే కాకుండా, చుట్టుపక్కల ఉన్నవారికి కూడా షాక్ తగిలే ప్రమాదం అధికంగా ఉంటుంది. కేవలం కాటన్ దారాన్ని మాత్రమే వాడండి. గాలిపటం తీగలలో చిక్కుకుంటే చేయకూడనివి గాలిపటం లేదా దారం విద్యుత్ లైన్‌కు చిక్కినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ ఉన్న తీగలను తాకేందుకు ప్రయత్నించవద్దు. వాటిని తీయడానికి కర్రలు, ఇనుప రాడ్లు లేదా ఇతర లోహ వస్తువులను అస్సలు ఉపయో గించకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. వెంటనే విద్యుత్ శాఖ టోల్-ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయండి లేదా మీ సమీపంలోని సెక్షన్ కార్యాలయానికి ఫిర్యాదు చేయం