సంక్రాంతి పండుగ సందర్భంగా  జాగ్రత్తలు పాటించాలి

స్వర్ణసాగరం బుచ్చినాయుడు కండ్రిగ.సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడంలో వినియోగదారుల భద్రత అత్యంత ముఖ్యం. ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటూనే, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా వినియోగదారు లందరూ కింది సూచనలను తప్పనిసరిగా పాటించాలని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. అని మండల విద్యుత్ శాఖ అధికారి చలపతి ఒక ప్రకటనలో తెలియజేశారు. భద్రతకు సంబంధించినపాటించవలసిన ముఖ్యమైన భద్రతా సూచనలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి: గాలిపటాలను ఎప్పుడూ విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు సబ్‌స్టేషన్లకు దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశాలలో...