స్వర్ణసాగరం నిర్భయ జర్నలిజంతో ప్రజల మన్ననలు పొందుతోంది
క్యాలెండర్‌ను ఆవిష్కరించిన నాగమల్లి దుర్గాప్రసాద్ స్వర్ణసాగరం - శ్రీకాళహస్తి స్వర్ణ సాగరం జాతీయ దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మీడియా కో-ఆర్డినేటర్, మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్ ఘనంగా ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణ సాగరం దినపత్రిక నిర్భయంగా నిజాలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని ప్రశంసించారు. ప్రజాసమస్యలను నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ దినపత్రిక, తక్కువ కాలంలోనే ప్రజల్లో విశ్వసనీయతను...