swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 8:48 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

అభివృద్థి సంక్షేమంతో సుపపరిపాలన అందిస్తున్న తెదేపా కూటమి ప్రభుత్వం

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల  అభివృద్థి అన్ని వర్గాల సంక్షేమంతో తెలుగుదేశం,జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,కోట క్లస్టర్ ఇన్చార్జ్ మద్దాలి సర్వోత్తమ రెడ్డి అన్నారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అథ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనతో ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలసి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా మార్చి ఒకటవ తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు తూపిలి రాధాక్రిష్ణారెడ్డి,జిల్లా బీసీ సెల్ కార్యదర్సి తీగల సురేష్ బాబు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పాలెపు సుధీర్ కుమార్ రెడ్డి,మర్రి అనీల్, నియోజకవర్గ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి తీపలపూడి పుట్టయ్య పార్టీ సీనియర్ నాయకుడు తిరివీధుల నాగార్జునతోను సచివాలయ సంక్షేమ సహాయకురాలు శ్రీమతి తన్మయి తో కలసి కోట దళిత వాడలో ఇంటింటికీ తిరిగి సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వితంతు వృద్థాప్య వికలాంగ పింఛన్లను పెంచి సమర్ధంగాఒకటవ తేదీనే 90 శాతం పంపిణీ పూర్తి చేస్తోందని అన్నారు.అలాగే సూపర్ సిక్స్ పధకాలు తల్లికి వందనం పధకం క్రింద ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఒక్కొక్కరికి15 వేల రూపాయలు, స్త్రీ శక్తి ఫధకం క్రింద రాష్ట్ర పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు,అన్నదాతా సుఖీభవ పధకం క్రింద రాష్ట్రంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలకు 14000 కలిపి మొత్తం 20000 ఇవ్వడం వంటివి పూర్తి స్థాయిలో అమలు అవుతుండడంతో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.దూరదృష్టితో అభివృద్ధి సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి యువ నాయకుడు మన భవిష్యత్తు నేత నారా లోకేష్ బాబు గూడూరు నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్న మన గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ కి అండగా నిలిచి ఆశీర్వదించాలని రాష్ట్ర, గూడూరు నియోజకవర్గ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో డమ్మాయి గిరిబాబు, పసల మస్తానయ్య,మద్దూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.