అభివృద్థి సంక్షేమంతో సుపపరిపాలన అందిస్తున్న తెదేపా కూటమి ప్రభుత్వం
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అభివృద్థి అన్ని వర్గాల సంక్షేమంతో తెలుగుదేశం,జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,కోట క్లస్టర్ ఇన్చార్జ్ మద్దాలి సర్వోత్తమ రెడ్డి అన్నారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అథ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనతో ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలసి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా మార్చి ఒకటవ...