swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 12:18 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ఈదూరు ఏడుకొండలు కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందించిన నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 25

కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన ఈదూరు కొండయ్య బుధవారం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కర్మక్రియల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఏడుకొండలు పార్థవ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ మనో ధైర్యాన్ని ఇచ్చారు. అధైర్య పడవద్దని మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఏడుకొండల కుటుంబానికి భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఏడుకొండలు కుటుంబ సభ్యులు హరీష్ చంద్ర రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హరీష్ చంద్రారెడ్డితో పాటు పెనగలూరు హర్షవర్ధన్ రెడ్డి,కోటయ్య,ఉదయ్,చిన్న,సునీల్,రవికిరణ్, హరి,నెల్లూరుజిల్లా విద్యార్ది విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల.రమేష్ ఉన్నారు.