కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28
కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించి అవ్వ తాతలు ముఖాలలో చిరునవ్వులు చిందిస్తుందని టిడిపి నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.కోట మండలం గూడలి గ్రామంలో శనివారం టిడిపి నాయకులు పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అర్హులకు పెన్షన్ పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమము మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేదీ ఇవ్వడం జరిగిందని అన్నారు.ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాలనతో అభివృద్ధి పథంలో నడుస్తుందని,ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలులో అండగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉన్నారు.