swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 7:04 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

కోటలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 19

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరాఠా యోధుడు,హిందూ హృదయ సామ్రాట్,ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను మండల కేంద్రమైన కోటలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఛత్రపతి శివాజీ మహరాజ్ చిత్రపటాన్ని చేతపట్టి,జోహార్ ఛత్రపతి శివాజీ మహరాజ్,జోహార్ శంభాజీ మహరాజ్,భారత్ మాతా కీ జై,జై శ్రీరామ్,జై భవానీ వీర శివాజీ, మాతరం మాతరం వందే మాతరం,భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం అంటూ  నినాదాలు చేస్తూ కోట గాంధీ బొమ్మ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొగలుల దండయాత్రను, దురాక్రమణను తన చిన్న వయస్సులోనే ఎదిరించి,మొగలుల హిందూ వ్యతిరేక చర్యలను తన నేతృత్వంలోని ప్రజల ద్వారా అడ్డుకొని హిందూ సామ్రజ్య పరిరక్షణకు పోరాడిన ఛత్రపతి శివాజీ మహరాజ్ బాటలో దేశ ప్రజలందరూ పయనించి దేశ భక్తితో ధర్మ పరిరక్షణకు,దేశ సమైఖ్యతను సమగ్రతను పరిరక్షంచేలా ప్రజలు ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ర్యాలీ అనంతరం లడ్డూలు పంపిణీ చేశారు.