swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 5:11 pm Digital Edition : RAMESH THOTTAMBEDU

గీతా శ్లోకాల గానంతో మంత్ర ముగ్ధులు చేసిన చిన్నారి,

భావార్థాన్ని ఆంగ్లంలో వివరించి ప్రశంసలు పొందిన ప్రవాసిని,

స్వర్ణసాగరం- శ్రీకాళహస్తి,

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ధూర్జటి కళా ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక భగవద్గీత, శివరుద్ర పారాయణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తికి చెందిన చిన్నారి ఎం. ప్రవాసిని భగవద్గీత శ్లోకాలను స్పష్టంగా పఠించి, వాటి భావాన్ని ఆంగ్లంలో సులభంగా, సరళంగా వివరించి సభికులను ఆకట్టుకుంది. ఆమె ప్రవచన శైలి, ధారాళమైన ఉచ్చారణ అందరినీ ఆకర్షించింది.
కార్యక్రమం అనంతరం ఆలయ అధికారుల తరపున ట్రస్ట్ బోర్డు సభ్యుడు దండు రాఘవయ్య చిన్నారిని సత్కరించి బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, ప్రసాదం అందజేశారు.
పిల్లల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు సనాతన ధర్మ పరిరక్షణకు దోహదం చేస్తాయని భక్తులు అభిప్రాయపడ్డారు.