గ్రూప్ 2 లో మెరిసిన ఆణిముత్యాలకు ప్రోత్సాహకాలు అందించిన చాపల శ్రీనివాసులు
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 2 ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 2 పరీక్షా ఫలితాల్లో విజేతలుగా నిలిచిన చిట్టేడు గ్రామానికి చెందిన ఇద్దరు ఆణిముత్యాలను సోమవారం చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ నేపథ్యంలో కోట మండలంలోని చిట్టేడు గ్రామానికి చెందిన జోక్కా వెంకటరమణయ్య కుమార్తె జోక్కా సుష్మిత,అదే గ్రామానికి చెందిన ముత్యాలపాటి విజయభాస్కర్ సునందమ్మ దంపతుల కుమారుడు ముత్యాలపాటి చైతన్య అను ఇద్దరూ గ్రూప్ -2 పరీక్షా ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. ముత్యాలపాటి చైతన్య అసిస్టెంట్ సెక్షన్...