swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 2:33 am Digital Edition : RAMESH THOTTAMBEDU

చెరువు కట్ట కింద ప్లాట్ల ఏర్పాటు… అనుమతులపై అనుమానాలు,

స్వర్ణసాగరం- తొట్టంబేడు,

తొట్టంబేడు మండల పరిధిలోని అప్పలాయగుంట చెరువు కట్ట దిగువ భాగానికి ఆనుకుని రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చెరువు కట్టకు సమీపంలో మట్టి రహదారి వేసి, సరిహద్దు రాళ్లు ఏ అనే ప్లాట్లు ఏర్పాటు చేయడం గమనార్హం.
చెరువుకు సంబంధించిన శికం భూముల్లో ప్లాట్లు వేయడం నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత భూములకు రెవెన్యూ, పంచాయతీ లేదా డీటీసీపీ అనుమతులు ఉన్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై తహసీల్దార్‌ను సంప్రదించగా, పూర్తి వివరాలు సేకరించి అవసరమైతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులూ స్థలాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో, అనుమతి లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.