చెరువు కట్ట కింద ప్లాట్ల ఏర్పాటు… అనుమతులపై అనుమానాలు,
స్వర్ణసాగరం- తొట్టంబేడు, తొట్టంబేడు మండల పరిధిలోని అప్పలాయగుంట చెరువు కట్ట దిగువ భాగానికి ఆనుకుని రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చెరువు కట్టకు సమీపంలో మట్టి రహదారి వేసి, సరిహద్దు రాళ్లు ఏ అనే ప్లాట్లు ఏర్పాటు చేయడం గమనార్హం.చెరువుకు సంబంధించిన శికం భూముల్లో ప్లాట్లు వేయడం నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత భూములకు రెవెన్యూ, పంచాయతీ లేదా డీటీసీపీ అనుమతులు ఉన్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై తహసీల్దార్‌ను సంప్రదించగా, పూర్తి వివరాలు సేకరించి అవసరమైతే...