swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 5:52 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నగర్ లో పలు గ్రావెల్ రోడ్లకు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి శ్రీకారం

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 6

కోట మండలం కోటలోని నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నగర్ (డాక్టర్ నాగభూషణ రావు వీధి)లోని 5 అడ్డ రోడ్లు కు రోడ్డును వేసేందుకు టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారు.నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నగర్ లోని ప్రజల కోరిక మేరకు శుక్రవారం వినోద్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించి సరైన రోడ్లు లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి వెంటనే 5 అడ్డరోడ్లకు గ్రావెల్ ను తోలించి నూతన గ్రావెల్ రోడ్లు ను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ఈసందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నగర్ లో ప్రజలు వర్షాకాలంలో రోడ్లు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారని,వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి నూతన గ్రావెల్ రోడ్లు ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.కోట పంచాయతీలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే తమకి తెలియజేయాలని,అలా సమస్యను తెలిపిన వెంటనే పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానన్ని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ రెడ్డి వెంట ఉపసర్పంచ్ గాది భాస్కర్,డాక్టర్ నాగభూషణ రావు,రాయపు పోలయ్య,కిరణ్, స్థానికులు ఉన్నారు.