swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 8:59 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష  సామగ్రి పంపిణీ

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 25

గూడూరు మండలం పరిధిలోని కొండగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అయ్యవారి పాలెం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల దృష్ట్య ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మంచి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని  సాధించే దిశగా కృషి చేయాలన్నారు.ప్రతి ఒక్కరు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు.అనంతరం పదో తరగతి లో మంచి మార్కులు సాధించిన వారికి తమ సంస్థ ద్వారా బహుమతులు అందచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతగా  వ్యవహరించిన ఎగ్గిరెడ్డి విజయ కుమార్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్,హెచ్.ఎం కోటేశ్వర రావు,ప్రగతి సేవా సంస్థ సభ్యులు వాకాటి రామ్మోహన్,పయ్యావుల మురళి నాయుడు,వి.ఎం.సి వెంకటేశ్వర రావు, శ్యామ్,వెంకట రావు,డిష్ నాగరాజు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు లీలా మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.