కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 16
కూటమి ప్రభుత్వంలో గ్రామ అభివృద్ధి,ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తానని నెల్లూరు మోహన్ రెడ్డి పేర్కొన్నారు.కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని రైస్ మిల్ హరిజనవాడలో టీడీపీ నేత రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి,పెనకి చెరువు నీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి సోమవారం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని నెల్లూరు పల్లి కొత్తపాలెం స్థానిక ప్రజలు నెల్లూరు మోహన్ రెడ్డి సహకారంతో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి సమస్యను తెలియజేసారు. ఈనేపథ్యంలో శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో నెల్లూరు మోహన్ రెడ్డి కృషితో సిమెంట్ రోడ్ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి.గ్రామ ప్రజలు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి,నెల్లూరు మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈసందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఊరి కోసం దేనికైనా సిద్ధం,ప్రజలు కోసమే పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని,తొందర్లో మిగతా రోడ్ల కూడా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.నెల్లూరు పల్లి కొత్తపాలెం పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తామని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని,నెల్లూరు మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో కట్ట శంకర్ రెడ్డి,నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి,గూడూరు రమేష్ రెడ్డి,ఎంపీటీసీ నారాయణ,బూత్ కన్వీనర్ గుండాల సుబ్రహ్మణ్యం,దుంపల నాగరాజు, కోదండరామిరెడ్డి,శ్రీకాంత్,శ్రీనివాసులు, మణి,పరశురామయ్య,కొండయ్య,వెంకటేశ్వర్లు కోటయ్య,గున్నయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.