swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 5:02 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ప్రజా సేవలో ఎప్పుడు ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ…షేక్ జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28

ప్రజాసేవలో ఎప్పుడు ముందుండే ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నేత జిల్లా పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.కోట పట్టణం శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ షేక్ జలీల్ అహ్మద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈసందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతినెల ఒకటవ తేదీన పింఛను ఉదయం 11 గంటల్లోపు దాదాపు పింఛని ప్రక్రియ పూర్తవుతుంది రూ,4వేలు,రూ,6వేలు,రూ15 వేలు రూ,చొప్పున లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందిస్తుందన్నారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అవ్వా తాతలకు,ఒంటరి మహిళలు, దివ్యాంగులు,ఇబ్బంది పడకుండా,చంద్రబాబు ఆదేశాలతో నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ జరగడం సంతోషదాయకం అన్నారు.
మార్చి 1 వ తేదీ ఆదివారం సెలవు కావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ప్రతినెల క్రమం తప్పకుండా పింఛన్ ను సచివాలయం సిబ్బంది అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఎ.యం.సి డైరెక్టర్ సిద్దపరెడ్డి పోలమ్మ,ఎంపీటీసీ దారా సురేష్,శంషుద్దీన్,కిరణ్,మధు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.