మొంథా తుఫాను ప్రభావం….. కంచనపల్లి ఆర్&బి రోడ్డుకు గండి, *ఎంపీడీవో సురేంద్రనాధ్ స్థల పరిశీలన,*
స్వర్ణ సాగరం ---తొట్టంబేడు, మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లి గ్రామం హరిజనవాడ నాగాలమ్మ పుట్ట సమీపంలో ఆర్&బి రోడ్డుకు గండి పడింది.వర్షపు నీరు ఊరువీధుల్లోకి చేరి రోడ్డు భాగం దెబ్బతిన్నందున వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ విషయాన్ని తెలుసుకున్న మండల అభివృద్ధి అధికారి పి. సురేంద్రనాధ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపై నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరాలు సేకరించారు.స్థలంలోనే ఆర్&బి అధికారులకు ఫోన్...