స్వర్ణసాగరం వాకాడు
మండలంలోని పంట్రంగం గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షి సమేత పాండురగేశ్వర, రామలింగేశ్వర స్వామి వారిదేవస్థానంలో శివరాత్రి సందర్బంగా ప్రత్యేక పూజలు ధర్మకర్త దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయం నందు తెల్లవారు జాము నుండి భక్తులు పెద్దఎత్తున క్యూలైన్ బారులు తీరారు భక్తులనోట శివనామస్మరణతో ఆలయంలో మారుమోగింది అత్యంత వైభవంగా విద్యుత్ దీపాలంకరణ విశిష్ట పూజలు,పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వర్చనలు వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. జువ్వినట్టు గ్రామంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణదేవి సమేత కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాద్ రెడ్డి, తూపిలి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పాలాభిషేకాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమం లోభక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి ఆశీసులు పొందారు అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం మండలంలోని తిరుమూరు గ్రామంలో వెలసియున్న శ్రీకామాక్షి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో పుత్తేటి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వేకువజామున నుండే మహాదేవునికి పూల అలంకారాలు,అభిషేకాలు, నిర్వహించారు. ఈ పూజలో గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి ఆశీసులు పొందారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయంలో అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా కన్నుల పండుగగా కళ్యాణమును ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణలతో శాస్రోక్తంగా ఆదిదంపతులకు కళ్యాణం జరిపించారు.
