మహిళ హఠాన్మరణం – గుండెపోటు అనుమానం
స్వర్ణసాగరం -శ్రీకాళహస్తి
,శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తొలి గేటు వద్ద ఆదివారం విషాదం చోటుచేసుకుంది. చిట్టమూరు మండలానికి చెందిన మణెమ్మ (45) ఆలయ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి కుప్పకూలారు.స్థానికులు, భక్తులు వెంటనే స్పందించి ఆమెను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. యాత్రికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆలయ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.