శ్రీసిటీ పరిశ్రమచే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణి

శ్రీసిటీ,స్వర్ణ సాగరం ఫిబ్రవరి 25, 2026:శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాకవర్త్ పరిశ్రమ వితరణతో ఇరుగుళం, మాదనపాళెం, అరవపాలెం జడ్పీ హైస్కూళ్ల పదవ తరగతి విద్యార్థులకు బుధవారం పరీక్షా సామగ్రి పంపిణి చేశారు. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షలు వ్రాయడం కోసం ఒక్కో విద్యార్థికి ఒక రైటింగ్ ప్యాడ్, రెండు పెన్నులు, జామెంట్రీ బాక్స్ చొప్పున మొత్తం 130 మంది విద్యార్థులకు మెటీరియల్ అందచేశారు. ఆయా స్కూళ్ల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాకవర్త్ ప్లాంట్ హెడ్ శ్రీరామ్,...