వెలుగు న్యూస్, చిట్వేలి
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సంఖ్యతో నాయకుడి బలాన్ని మరింతగా పెంచుదామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రమైన చిట్వేలి లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సభ్యత్వ సన్నాహక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిట్వేలి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి జనసైనికులు పార్టీ అభిమానులు హాజరయ్యారు. ఈ శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగేంద్ర సభ్యత్వ నమోదు తీరును వివరించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని చెప్పారు. ప్రారంభంలో 150 మందితో సభ్యత్వం నమోదు కాగా ఆ తరువాత అది 93 వేలకు చేరిందని, అనంతరం 3 లక్షలకు పెరిగిందని, దాని తర్వాత 6 లక్షలు, 2024 ఎన్నికల ముందు 12 లక్షల 13 వేల మంది జనసేన క్రియాశీలక సభ్యులు ఉండేలా పార్టీ బలపడిందని వివరించారు. పార్టీ మీద అభిమానంతో, ఎంతోమంది కార్యకర్తలు తాను పర్యటనలకు వెళ్ళినప్పుడు రోడ్డు ప్రమాదాల్లోనూ, ఫ్లెక్సీలు కడుతూ కరెంటు తీగలకు బలైపోయి అసువులు బాసారన్నారు. అటువంటి మృతదేహాలు, బాధతో ఉన్న వారి తల్లిదండ్రుల కన్నీళ్ళ మీద తాను ఉపముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నానని, తాను బతికి ఉన్న చివరి క్షణం వరకు ప్రతి జన సైనికుడికి అండగా నిలబడతానని పవన్ కళ్యాణ్ చెప్పిన మాట తనను కదిలించిందని నాగేంద్ర వివరించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ను ఎవరెవరో ఎన్ని విధాలుగానో అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రతి జన సైనికుడు తిప్పి కొట్టాలన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పెనగలూరు మండల నాయకులు ఎర్రంశెట్టి హరి రాయల్ మాట్లాడుతూ 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎత్తిన జెండా దించకుండా మోస్తున్నామన్నారు. రైల్వే కోడూరు జనసేన నాయకులు గంగన్న యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే పవన్ చేసిన త్యాగ ఫలితంగా కూటమి ఏర్పడిందన్నారు. అందుకే ఆయన అంటే తనకు స్ఫూర్తి కలిగి జనసేనలో చేరినట్టు చెప్పారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తమ పంచాయితీని కచ్చితంగా జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థిని గెలిపించి తీరుతానని వాగ్దానం చేశారు. చిట్వేలి మండల జనసేన నాయకులు మద్దూరి మన్మధ మాట్లాడుతూ ప్రతి జన సైనికుడు సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొని పవన్ కళ్యాణ్ పైన అభిమానం చాటుకోవాలన్నారు. చిట్వేలి మండల జనసేన నాయకులు కంచర్ల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు లోని మూడు విభాగాల గురించి వివరించారు. ఇదే సందర్భంగా తాను తన విధి నిర్వహణలో ఉండి నేరుగా సభ్యత్వ నమోదులో పాల్గొనలేనని, అందుకోసం 100 సభ్యత్వాల కయ్యే మొత్తాన్ని పార్టీ కోసం వితరణ చేస్తున్నట్టు చెప్పారు. సింగనమల వీధికి చెందిన పెద్దంగారి సాయి కూడా 100 సభ్యత్వాలకయ్యే మొత్తాన్ని తాను వితరణ చేస్తున్నట్టు ప్రకటించారు. చివర చిట్వేల్ మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గం ఆశ్చర్యపోయేలా చిట్వేలు మండలం సభ్యత్వ నమోదు చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్టుగా ఇవ్వబోతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ, బత్తిన గంగయ్య,ఎర్రం శెట్టి హరిబాబు, సూర్యల ధర్మయ్య, తుపాకులు పెంచలయ్య, మద్దూరి మన్మధ,పెద్దం గారి సాయి, కంచర్ల సుధీర్ రెడ్డి,షేక్ రియాజ్,మాదాసు శివ, దాది రామచంద్ర,ఎర్రజన్న గారి చలపతి, కొనిశెట్టి చక్రి, గొబ్బూరు హరి,బీద నవీన్, కొండయ్య గారి పల్లి మనీ, సువారపు నాగేశ్వరరావు,మోడం చిరంజీవి, సుగవాసి శివ శంకర్, పగడాల శేషాద్రి, ఎద్దుల జయచంద్ర, సువ్వారపు హరిప్రసాద్,మహంకాళి నాగేంద్ర,నాన్న బాల మోహన్, పసుల సుబ్బు, మాదినేని రాజా, తాతం శెట్టి రెడ్డయ్య, గంగయ్య, సుంకర శీను, కొత్తపల్లి ఈశ్వరయ్య, పొన్నారెడ్డి,తోట శివప్రసాద్, ఈడిగపల్లి నాగేంద్ర,జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.