సహకార సంఘాల కార్యాలయాలకు తాళాలు,

రెండున్నర నెలల ఆందోళనకూ స్పందన శూన్యం, డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు హెచ్చరిక, స్వర్ణసాగరం - తొట్టంబేడు, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన మళ్లీ ఉధృతమైంది. దాదాపు రెండున్నర నెలలుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన సమ్మె చేపట్టినట్లు ఉద్యోగులు ప్రకటించారు.ఇప్పటివరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద, గుంటూరులోని ఆర్‌సీఎస్ కార్యాలయం వద్ద పలు...