swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 3:41 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

సి.ఐ కిషోర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 9

గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సుచలతో గూడూరు రూరల్ సీ.ఐ కిషోర్ బాబు ని మరియు కోట మండలం ఎస్సై పవన్ కుమార్ ని సోమవారం కోట మండలం రైతు సంఘం అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి
శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కోట మండలంలో శాంతి భద్రతలు, ప్రజా సమస్యలు మరియు ముఖ్యంగా యువతకు చట్టాలపై అవగాహన కలిగించాలని సీఐ కిషోర్ బాబు కి తెలియజేశారు.ప్రజలకు పోలీసు శాఖ అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరాలనే దిశగా,ప్రజలు పోలీస్ శాఖ వారు సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఐ ని కోరారు.ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలని ఆయన తెలియజేశారు.